Temple info -3822. Sundilla Yoganarsimha Swamy temple, Karimnagar. சுண்டில்லா யோக நரசிம்ம ஸ்வாமி கோயில்,கரீமநகர்

 Temple info -3822

ఆలయ సమాచారం -3822

கோயில் தகவல்-3822


 Sundilla Yoga Narasimha Swamy Temple,Karimnagar


Sundilla Yoga Narasimha Swamy: Manifested as a Deity of Serenity! While Narasimha Swamy is typically worshipped as an *Ugra Murthy* (a fierce deity) in many places, in the village of Sundilla in Karimnagar district, He is revered as a *Shantha Murthy* (a deity of serenity). Unlike other locations where He resides amidst hills and rocky outcrops, here He is enshrined in a beautiful temple.

The primary purpose of the Narasimha avatar was fulfilled after He slew Hiranyakashipu and protected Prahlada. While He is known to have settled in various places retaining that fierce form for the sake of His devotees, the story of the Sundilla deity is different. It is said that Narasimha Swamy, still in His terrifying, fierce form, washed His claws and feet in the sacred Godavari River here. Devotees believe that as the waters of the Godavari touched His face and He scooped the water in His palms, He transformed into a serene deity. He found this quiet, lush green area to be an ideal setting for penance. After attaining this state of serenity, He sat here in a meditative posture (*Yoga Mudra*), and over time, anthills formed around His body. There is no other place where Narasimha Swamy has manifested in such a spiritually profound state; this unique shrine is located in Sundilla village, Kamanpur Mandal, Karimnagar district.


Temple Legend: The mythological story behind the Sundilla temple is fascinating. A Brahmin living in Jangaon used to visit his agricultural fields in nearby Sundilla. The area was a dense forest, yet the elderly man would occasionally bring his ten-year-old grandson along on these visits. One day, for some reason, his grandson could not accompany him. The lone Brahmin wandered through the fields, grew exhausted, and lost his way. Darkness fell quickly, leaving him unsure of the direction to his village. In his distress, he prayed fervently to the Almighty, "Oh God! What am I to do? You alone are my refuge as I wander here, lost." Almost immediately, a young boy—about the same age as his grandson—approached him. "Grandpa! Have you lost your way? Come, I will show you the right path," the boy said, leading him along. "Sleep in this *mantapam* (pavilion) tonight. Here... have some *prasadam* (offering) from the Lord—coconut and jaggery," the boy said before lying down himself. The Brahmin agreed, ate the *prasadam*, and, being weary, spread out the cloth he had been carrying on his shoulder and lay down to sleep.



In the middle of the night, Lord Vishnu appeared to him in the form of Narasimha in a dream. "I am right beside you. Do not fear. Dig into the anthill and see," the Lord said. When he opened his eyes, dawn was breaking. The boy who had been beside him was gone. He placed his ear close to the anthill and heard sacred *Beejaksharas* (seed syllables) resonating within the sounds of breathing. He was filled with bewilderment. He realized that Lord Narayana—whom he worshipped constantly—had come to uplift him. He hurried home, completed his ablutions and daily rituals, took a crowbar, brought his grandson along, and traveled from Jangaon to Sundilla. It took three days to completely dig up the anthill. As he dug into the anthill, neglecting food and sleep, family and neighbors thought he had lost his mind. Before dawn on the fourth day, he took a crowbar and began clearing away the earth. Upon striking the right side with the crowbar, he reportedly heard a groan: "Oh! Stop!" Realizing his error, he washed the affected area with the Godavari water he had kept for drinking; his hand was stained with blood, and the spot itself had turned red. In the light of the rising sun, he beheld a stone idol seated on a pedestal with its hands in a *yoga mudra*, and he was filled with both joy and astonishment. It was a sandstone idol with a chest that was black on one side and red on the other. Notably, the Lord appeared facing south. The southern direction is associated with Yama Dharma Raja; elders say that entering temples facing this direction spares one from the torments of Yama.

A Temple Built by the Kakatiyas: A nearby stone inscription reveals that the Kakatiya dynasty built this temple in the 13th century AD. Ruins visible about 200 yards to the northeast indicate the existence of an ancient temple there. However, the temple tank (*koneru*) located to the southwest was filled in, and donors constructed a large hall on that site for the convenience of the devotees. Although the script of the inscription resembles the style of that era, the sequence of characters is difficult to decipher. Recently, at the request of devotees, an idol of Goddess Sri Lakshmi was consecrated. The presence of a Kakatiya-era Shiva temple 50 yards to the west and a Hanuman temple 100 yards away makes it evident that no distinction between Shiva and Keshava was observed here in the past. Furthermore, Sundilla and Velala lie opposite each other, separated by the Godavari River; the temple of Yoga Narasimha Swamy stands on one bank, while the temple of Velala Mallanna stands on the other. Locals say that this region, with its scenic natural beauty, has long been renowned as a *Moksha Bhumi* (a land of salvation) suitable for meditation and penance. A *Bhajana Saptaham* (week-long devotional singing festival) is held here annually during the month of Dhanurmasam. Devotees from surrounding villages like Kundaram, Settipelli, and Shivvaram participate in large numbers, and *Nityannadanam* (daily free food distribution) is organized throughout the event. Additionally, the Lord's *Kalyana Brahmotsavams* (celestial wedding celebrations) are conducted every year during the month of Phalguna. Furthermore, every month, devotees from distant places arrive to perform *Ekaham* (a continuous 24-hour *Bhajan* session) and offer *Annadanam* (free food distribution). Devotees believe that spending a night at the temple alleviates various forms of suffering and hardship. It is said that those suffering from mental distress or children afflicted by childhood ailments find relief and go on to lead happy, peaceful lives after sleeping here; people often share numerous personal accounts and stories as living proof of this. Accommodation facilities are available for devotees wishing to stay at the temple. Potable (sweet) water is available round-the-clock, and temple staff and priests are always on hand. The current priest is Jayanth Sharma—the fifth-generation descendant of the Brahmin who originally discovered the deity in this region (and the sixth son of Sundilla Narsaiah). In addition to those fulfilling vows, a spacious hall and officiating priests are available for devotees wishing to perform the *Sri Satyanarayana Swamy Vratham* in the deity's presence. Scholars state that offering jaggery placed inside a dried coconut shell to the Lord, and *Odi Biyyam* (a ritual offering of rice) to the Goddess, is considered highly auspicious.

శాంతమూర్తిగా వెలసిన సుందిళ్ల యోగ నరసింహస్వామి! నృసింహస్వామి అనేక ప్రాంతాల్లో ఉగ్రమూర్తి. కానీ, కరీంనగర్ జిల్లా సుందిళ్ల గ్రామంలో శాంతమూర్తి. మిగతా ప్రదేశాలలో కొండలు, గుట్టల్లో వెలిస్తే ఇక్కడ మాత్రం అందమైన కోవెలలో కొలువైనాడు.

పూర్వం హిరణ్యకశిపుని చంపి, ప్రహ్లాదుని రక్షించిన తర్వాత నృసింహస్వామి అవతార ధర్మం పూర్తవుతుంది. అదే ఉగ్రరూపంతో అనేక చోట్ల భక్తుల కోసం స్థిరపడడం మనకు తెలుసు. కానీ, సుందిళ్ల స్వామిది వేరే కథ. భయంకరమైన ఆ ఉగ్రరూపంతో ఉన్న నరసింహస్వామి ఇక్కడి పవిత్ర గోదావరి నదిలో తన గోళ్ళు, కాళ్ళు కడుక్కున్నాడట. గోదావరి నీరు ముఖంపై పడగానే, వాటిని ఆయన దోసిలితో తాకగానే శాంతమూర్తిగా మారాడంటారు భక్తులు. పచ్చని ప్రకృతిగల ఈ నిశ్శబ్ద ప్రాంతాన్ని నృసింహస్వామి తన తపస్సుకు అనుకూలమైన స్థలంగా భావించాడు. శాంతమూర్తిగా మారిన తర్వాత ఇక్కడే యోగమువూదలో కూర్చున్నాడు. అప్పుడు స్వామి ఒళ్లంతా పుట్టలు పెట్టాయి. ఇంతటి మహిమాన్విత స్థితిలో నరసింహస్వామి వెలసిన చోటు మరెక్కడో లేదు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని సుందిళ్ళ గ్రామంలో ఉంది.


స్థల పురాణం: సుందిళ్ల ఆలయ పౌరాణిక కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒక బ్రాహ్మణుడు జనగామలో నివసిస్తూ చేరువలోనే ఉన్న సుందిళ్ళలోని తన పొలాలకు వచ్చేవాడు. అసలే అది అడవి ప్రాంతం. అందులో ఆ వృద్ధుడు తన పదేళ్ళ మనుమని వెంట బెట్టుకొని అక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. ఒకనాడు మనమడెందుకో రాలేకపోయాడు. ఒక్క బ్రాహ్మణుడే పొలంలో తిరిగి అలసిపోయి దారితప్పుతాడు. అంతలోనే చీకటి పడుతుంది. దాంతో తన ఊరికి ఎటువైపు వెళ్ళాలో తెలియక ‘హా భగవంతుడా! ఏమిటి చేయడం. దారి తెలియక తిరుగుతున్న నాకు నీవే దిక్కని’ భక్తితో భగవంతుని స్మరించుకున్నాడు. తలచిందే తడువుగా ఒక బాలకుడు, తన మనుమని వయస్సువాడే పహ్లాదుడు) అతని దగ్గరకు వస్తాడు. ‘‘తాతా! దారి తప్పావా! సరైన త్రోవ నేను చూపిస్తాను రా!’’ అని తీసుకొని పోతాడు. ‘‘ఈ రాత్రి ఈ మంటపంలో పడుకో. ఇదిగో... స్వామి ప్రసాదం. కొబ్బరి, బెల్లమున్నది తిను’’మని ఇచ్చి పడుకున్నాడు. ‘‘సరే’’ అని బ్రాహ్మణుడు ప్రసాదం తినేసి, అలసిపోవడంతో భుజంపైన వేసుకొన్న పంచె పరచుకొని పడుకున్నాడు.


అర్ధరాత్రి అతని కలలో విష్ణుమూర్తి నృసింహ రూపంలో దర్శనమిస్తాడు. ‘‘నేను నీ పక్కనే ఉన్నాను. భయపడకు. పుట్ట తవ్వి చూడ’’మన్నాడు. కళ్ళు తెరిచి చూసే సరికి తెలతెలవారుతున్నది. పక్కలోని బాలుడు లేడు. పుట్టదగ్గర చెవి పెట్టాడు. ఉచ్ఛాస నిశ్వాసల్లోంచి బీజాక్షరాలు వినిపించసాగాయి. అంతా అయోమయం. తాను నిరంతరం పూజించే నారాయణమూర్తి తనను ఉద్ధరించ వచ్చాడని గ్రహించాడు. గబగబ ఇంటికి వెళ్ళాడు. స్నాన పానాదులు, నిత్యకృత్యాలు ముగించుకొని గునపం చేత పట్టుకొని, మనుమన్ని వెంట బెట్టుకొని సుందిళ్ళకు జనగామ నుండి వచ్చాడు. పుట్ట పూర్తిగా తవ్వేసరికి మూడు రోజులు పట్టింది. నిద్రాహారాలు మాని పుట్ట తవ్వుతుంటే ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అతనిని చూసి ‘పిచ్చిపట్టింద’న్నారు. నాల్గవ రోజు తెల్లవారక ముందే గునపం తీసుకొని మట్టిని తొలగించసాగాడు. కుడివైపు గునపం దెబ్బ తగలగానే ‘‘అబ్బా ఆపరా!’’ అనే మూలుగు వినిపించిందిట. అంతే! తన అపరాధాన్ని తెలుసుకొని, తాను తాగటానికి తెచ్చి పెట్టుకున్న గోదావరి నీళ్ళతో దెబ్బ తగిలిన భాగాన కడిగాడు. చేతికి రక్తపు మరక, ఆ భాగమంతా ఎరుపు రంగు. సూర్యకిరణాల వెలుగులో పీఠం పెట్టుకొని, చేతులు యోగమువూదతో వున్న శిలా విగ్రహాన్ని చూసి ఆనందంతో ఆశ్చర్యపోయాడు. ఛాతి ఒకవైపు నలుపు, మరో పార్శం ఎరుపు కలిగిన ఇసుకరాతి విగ్రహం. అయితే, స్వామి దక్షిణాభి ముఖంగా దర్శనమిచ్చాడు. దక్షిణ ద్వారం (దిక్కు) యమధర్మరాజుది. ఈ వైపున్న దేవాలయాల్లోకి ప్రవేశిస్తే యమబాధలుండవని పెద్దలు అంటారు

కాకతీయులు కట్టిన ఆలయం: క్రీ.శ. 13వ శతాబ్దంలో కాకతీయరాజ వంశస్థులు ఈ దేవాలయం నిర్మించినట్లు సమీపంలోని ఓ శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. దేవాలయానికి ఈశాన్య భాగంలో 200 గజాల దూరాన పురాతన దేవాలయమున్నట్లు ఆలయ శిథిలాలు నేటికీ దర్శనమిస్తాయి. అయితే, నైరుతి దిశలోని కోనేరును కూడ్పించి, ఆ స్థలంలో స్వామివారి భక్తుల సౌకర్యార్థం పెద్ద హాలును దాతలు నిర్మించారు. శాసన భాష లిపి మాదిరిగా ఉన్నా అక్షర క్రమం సరిగా అర్థం కాకుండా ఉంది. గతకొద్ది కాలం క్రితం భక్తుల కోరిక మేరకు శ్రీలక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టించారు. ఈ గుడికి పడమరన 50 గజాల దూరాన కాకతీయుల కాలం నాటి శివాలయం, 100 గజాల దూరాన హన్మంతుని దేవాలయం ఉండటంతో నాడు శివకేశవ భేదం ఇక్కడ పాటించలేదన్నది స్పష్టమవుతోంది. అంతేగాక, సుందిళ్ళ- వేలాల ఎదుదురు ప్రాంతాలు. మధ్యలో గోదావరి, యోగ నృసింహస్వామి, ఆ ఒడ్డున వేలాల మల్లన్న. ప్రకృతి రమణీయమైన ఈ ప్రాంతం ధ్యానానికి, తపస్సుకు అనువైన ‘మోక్షభూమి’గానూ అనాదిగా ప్రసిద్ధమైనట్టు స్థానికులు చెప్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో భజన సప్తాహం జరుగుతుంది. కుందారం, సెట్టిపెల్లి, శివ్వారం చుట్టు పక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. అలాగే, ప్రతి ఏడూ ఫాల్గుణ మాసంలో స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేగాక, ప్రతినెలలో ఎవరో ఒకరు దూరవూపాంతాల నుండి వచ్చి ఏకాహం (24 గంటల భజన) చేసి అన్నదానం చేస్తారు. ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే ఈతి బాధలనేకం తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. మానసికంగా బాధపడ్తున్న వారిని, బాలారిష్టాలున్న పిల్లలను తీసుకొని వచ్చి నిద్ర చేయిస్తే, వారికి బాధలు తీరి, సుఖ సంతోషాలతో గడుపుతారంటారు. ఈ మేరకు అలాంటి వారి గాథపూన్నో ప్రత్యక్ష నిదర్శనంగా ప్రజలు వినిపిస్తారు. భక్తులు ఆలయంలో ఉండటానికి వసతి గదులున్నాయి. 24 గంటలు మంచి (తియ్యని) నీరు అందుబాటులో ఉంటాయి. ఆలయ సిబ్బంది, అర్చకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. స్వామిని ఈ ప్రాంతంలో గుర్తించిన బ్రాహ్మణుని ఐదవ తరం పూజారి జయంత్‌శర్మ (సుందిళ్ళ నర్సయ్యగారి 6వ కుమారుడు) ఇప్పుడు అర్చకుడిగా ఉన్నారు. మొక్కులు తీర్చుకునే వారేకాక, స్వామి వారి సన్నిధిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి కూడా అనువైన పెద్ద హాలు, ఆచార్యులు అందుబాటులో ఉంటారు. ఎండు కొబ్బరి కుడుకలో బెల్లం స్వామికి, ఓడి బియ్యం అమ్మకు పెట్టడం చాలా శ్రేష్టమని పండితులు చెప్తారు.


சாந்தமான தோற்றத்தில் தோன்றிய சுண்டில்லா யோக நரசிம்ம சுவாமி! நரசிம்ம சுவாமி பல இடங்களில் சாந்தமானவராகக் காணப்படுகிறார். ஆனால், கரீம்நகர் மாவட்டத்தின் சுண்டில்லா கிராமத்தில், அவர் ஒரு சாந்தமானவராகக் காணப்படுகிறார். மற்ற இடங்களில், அவர் மலைகளிலும் குன்றுகளிலும் தோன்றுகிறார், ஆனால் இங்கே அவர் ஒரு அழகான குகையில் இருக்கிறார்.


முன்னர், இரண்யகசிபுவைக் கொன்று பிரகலாதனைக் காப்பாற்றிய பிறகு, நரசிம்ம சுவாமியின் அவதாரம் நிறைவடைந்தது. அவர் அதே சாந்தமான தோற்றத்தில் பக்தர்களுக்காகப் பல இடங்களில் குடியேறினார் என்பது நமக்குத் தெரியும். ஆனால், சுண்டில்லா சுவாமியின் கதை வேறு. அந்த பயங்கரமான சாந்தமான தோற்றத்தில் இருந்த நரசிம்ம சுவாமி, இங்குள்ள புனித கோதாவரி நதியில் தனது நகங்களையும் பாதங்களையும் கழுவினார். கோதாவரி நீர் அவர் முகத்தில் பட்டு, அவரது கைத்தடியால் தொட்டவுடன், அவர் சாந்தமானவராக மாறினார் என்று பக்தர்கள் கூறுகிறார்கள். பசுமையான இயற்கையுடன் கூடிய இந்த அமைதியான இடத்தை தனது தவத்திற்கு ஏற்ற இடமாக நரசிம்ம சுவாமி கருதினார். சாந்தமானவராக மாறிய பிறகு, அவர் இங்கே யோகாசனத்தில் அமர்ந்தார். பிறகு அந்த சுவாமியின் உடல் முழுவதும் மச்சங்கள் தோன்றின. நரசிம்ம சுவாமி இத்தகைய மகிமையான கோலத்தில் காட்சியளிக்கும் வேறு இடம் இல்லை. இது கரீம்நகர் மாவட்டம், காமன்பூர் மண்டலத்திலுள்ள சுண்டில்லா கிராமத்தில் அமைந்துள்ளது.


இடத்தின் புராணக்கதை: சுண்டில்லா கோயிலின் புராணக்கதை மிகவும் சுவாரஸ்யமானது. ஜனகமாவில் வசித்து வந்த ஒரு பிராமணர், அருகிலுள்ள சுண்டில்லாவில் இருந்த தனது வயல்களுக்கு வந்து செல்வார். அது உண்மையில் ஒரு வனப்பகுதியாக இருந்தது. அந்த முதியவர், தனது பத்து வயது பேரனையும் தன்னுடன் அழைத்துக்கொண்டு, அவ்வப்போது அங்கு சென்று வருவார். ஒரு நாள், அவருக்கு எந்த வழியும் தெரியவில்லை. அப்போது ஒரு பிராமணர் களைப்படைந்து வயலில் வழிதவறிப் போனார். அந்த நேரத்தில் இருட்டிவிட்டது. தனது கிராமத்திற்குச் செல்லும் வழி தெரியாமல், அவர், ‘கடவுளே! நான் என்ன செய்வது? வழி தெரியாமல் அலைந்து கொண்டிருக்கிறேன்’ என்றார். அவர் பக்தியுடன் கடவுளை நினைத்தார். அவர் யோசித்துக் கொண்டிருந்தபோது, ​​அவருடைய பேரனின் (பஹ்லாத்) அதே வயதுடைய ஒரு சிறுவன் (பஹ்லாத்) அவரிடம் வந்தான். ‘தாத்தா! நீங்கள் வழிதவறிவிட்டீர்களா!’ நான் உனக்கு சரியான பாதையைக் காட்டுகிறேன்!’’ அவர் அவனை அழைத்துச் சென்றார். ‘‘இன்று இரவு இந்தப் பந்தலில் உறங்கு. இதோ… சுவாமியின் பிரசாதம். கொஞ்சம் தேங்காயும் வெல்லமும் சாப்பிடு,’’ என்று கூறிவிட்டு அவர் உறங்கச் சென்றார். பிரசாதத்தைச் சாப்பிட்ட பிறகு, ‘‘சரி,’’ என்று அந்த பிராமணன் கூறினான். களைப்புடன், அவன் தன் தோளில் வைத்திருந்த ஐந்து துண்டு துணியைப் போட்டுக்கொண்டு உறங்கச் சென்றான்.


நள்ளிரவில், விஷ்ணு பகவான் நரசிம்ம ரூபத்தில் அவன் கனவில் தோன்றினார். ‘‘நான் உன் அருகில் இருக்கிறேன். பயப்படாதே. குழி தோண்டிப் பார்,’’ என்றார். அவன் கண்களைத் திறந்தபோது, ​​இருட்டத் தொடங்கியது. அவனருகில் இருந்த சிறுவன் அங்கு இல்லை. அவன் தன் காதை அந்தக் குழியின் அருகே வைத்தான். அவன் மூச்சை உள்ளிழுக்கும்போதும் வெளியிடும்போதும் ‘பீஜாக்ஷரம்’ (விதைகள்) என்ற வார்த்தைகள் வெளிவருவதை அவனால் கேட்க முடிந்தது. எல்லாம் குழப்பமாக இருந்தது. தான் இடைவிடாமல் வழிபட்டு வந்த நாராயணன், தன்னைக் காப்பாற்ற வந்திருக்கிறார் என்பதை அவன் உணர்ந்தான். அவன் அவசரமாக வீட்டிற்குச் சென்றான். குளித்து முடித்து, தனது அன்றாடக் காரியங்களை முடித்தபின், அவன் குணப்பத்தை எடுத்துக்கொண்டு மனுமனையும் தன்னுடன் ஏற்றிக்கொண்டு ஜனகமவிலிருந்து சுண்டில்லாவிற்கு வந்தான். அந்தக் குழியை முழுமையாகத் தோண்டுவதற்கு மூன்று நாட்கள் ஆனது. அவன் உண்பதையும் உறங்குவதையும் நிறுத்திவிட்டு, குழியைத் தோண்டிக்கொண்டிருந்தபோது, ​​அவனது குடும்பத்தினரும் அண்டை வீட்டாரும் அவனைக் கண்டு, "இவனுக்குப் பைத்தியம் பிடித்துவிட்டது" என்றனர். நான்காம் நாள், விடியலுக்கு முன், அவன் ஒரு மண்வெட்டியை எடுத்து மண்ணை அகற்றத் தொடங்கினான். மண்வெட்டி அவனது வலது பக்கத்தில் பட்டவுடனேயே, "ஓ, நிறுத்து!" என்ற முனகல் சத்தத்தைக் கேட்டான். அவ்வளவுதான்! தனது குற்றத்தை உணர்ந்து, குடிப்பதற்காகக் கொண்டு வந்திருந்த கோதாவரி நீரால் பாதிக்கப்பட்ட இடத்தைக் கழுவினான். அவனது கையில் இரத்தக்கறை படிந்திருந்தது, மேலும் அந்தப் பகுதி முழுவதும் சிவந்து போயிருந்தது. சூரியக் கதிர்களின் ஒளியில், ஒரு பீடத்தில் வைக்கப்பட்டிருந்த, யோகாசனங்களில் கைகளைக் கொண்ட கல் சிலையைக் கண்டபோது அவன் ஆனந்த ஆச்சரியமடைந்தான். அது ஒரு மணற்கல் சிலை, அதன் மார்பின் ஒரு பக்கம் கருப்பாகவும் மறுபக்கம் சிவப்பாகவும் இருந்தது. இருப்பினும், இறைவன் தெற்கு நோக்கித் தோன்றியிருந்தார். தெற்கு வாசல் (திசை) யமதர்மராஜனுடையது. இந்தப்பக்கம் உள்ள கோயில்களுக்குள் நுழைந்தால், யமனின் தண்டனைகளால் பாதிக்கப்பட மாட்டீர்கள் என்று பெரியவர்கள் கூறுகிறார்கள்.

காகத்தியர்களால் கட்டப்பட்ட கோயில்: அருகிலுள்ள ஒரு கல்வெட்டு, இக்கோயில் 13 ஆம் நூற்றாண்டில் காகத்திய மன்னர்களின் வழித்தோன்றல்களால் கட்டப்பட்டது என்பதைக் குறிப்பிடுகிறது. இக்கோயிலுக்கு வடகிழக்கே 200 கெஜம் தொலைவில் ஒரு பழமையான கோயில் இருந்ததால், அதன் இடிபாடுகள் இன்றும் காணப்படுகின்றன. இருப்பினும், நன்கொடையாளர்கள் தென்மேற்கு திசையில் இருந்த கோனேருவை அகற்றி, இறைவனின் பக்தர்களின் வசதிக்காக அந்த இடத்தில் ஒரு பெரிய மண்டபத்தைக் கட்டினர். கல்வெட்டின் மொழி அச்சு வடிவத்தை ஒத்திருந்தாலும், எழுத்துக்களின் வரிசை சரியாகப் புரியவில்லை. சில காலத்திற்கு முன்பு, பக்தர்களின் வேண்டுகோளின்படி, ஸ்ரீ லட்சுமி அம்மா பிரதிஷ்டை செய்யப்பட்டார். இக்கோயிலுக்கு மேற்கே 50 கெஜம் தொலைவில் காகத்தியர் காலத்தைச் சேர்ந்த ஒரு சிவன் கோயிலும், 100 கெஜம் தொலைவில் ஒரு அனுமன் கோயிலும் இருப்பதால், அக்காலத்தில் இங்கு சிவன்-கேசவன் என்ற வேறுபாடு பின்பற்றப்படவில்லை என்பது தெளிவாகிறது. மேலும், சுண்டில்லா-வேலா பகுதிகளுக்கு எதிரே, நடுவில் கோதாவரி, யோக நரசிம்ம சுவாமி, அதன் கரையில் வேலால மல்லண்ணா ஆகியவை அமைந்துள்ளன. அழகான இயற்கை வளம் நிறைந்த இப்பகுதி, தொன்றுதொட்டு தியானத்திற்கும் தவத்திற்கும் உகந்த 'மோட்ச பூமி' என்று புகழ் பெற்றிருப்பதாக உள்ளூர் மக்கள் கூறுகின்றனர். ஒவ்வொரு ஆண்டும், தனுர்மாசத்தில் ஒரு வார கால பஜன சப்தஹம் இங்கு நடைபெறுகிறது. குண்டாரம், செட்டிப்பள்ளி, சிவராம் போன்ற அருகிலுள்ள கிராமங்களிலிருந்து பக்தர்கள் பெருமளவில் இதில் கலந்துகொள்கின்றனர். இந்த நிகழ்வின்போது, ​​தினமும் உணவுப் படையல்கள் செய்யப்படுகின்றன. மேலும், பால்குன மாதத்தில், ஏழு நாட்களுக்கு ஒருமுறை சுவாமியின் கல்யாண பிரம்மோற்சவம் நடைபெறுகிறது. அதுமட்டுமின்றி, ஒவ்வொரு மாதமும் தொலைதூர இடங்களிலிருந்து ஒருவர் இங்கு வந்து ஏகஹம் (24 மணி நேர பஜனம்) செய்து, உணவுப் படையல்களை அளிக்கிறார். இங்கு ஓர் இரவு தங்கினால், தங்களின் பல துன்பங்கள் நீங்கிவிடும் என்று பக்தர்கள் நம்புகிறார்கள். மனநோயால் பாதிக்கப்பட்டவர்களையும், குழந்தைப் பருவக் குறைபாடுகள் உள்ள குழந்தைகளையும் இங்கு கொண்டு வந்து தங்க வைத்தால், அவர்களின் துன்பங்கள் நீங்கி, அவர்கள் மகிழ்ச்சியாக வாழ்வார்கள் என்று கூறப்படுகிறது. இதற்கு நேரடிச் சான்றாக, அத்தகையவர்களின் கதைகளை மக்கள் கூறுகின்றனர். கோயிலில் பக்தர்கள் தங்குவதற்குத் தங்குமிடங்கள் உள்ளன. 24 மணி நேரமும் நல்ல (தூய) தண்ணீர் கிடைக்கிறது. கோயில் ஊழியர்களும் அர்ச்சகர்களும் எப்போதும் இருப்பார்கள். இப்பகுதியில் சுவாமியைக் கண்டறிந்த பிராமணரின் (சுண்டில்லா நர்சய்யாவின் 6வது மகன்) ஐந்தாம் தலைமுறை அர்ச்சகரான ஜெயந்தஷர்மா, தற்போது அர்ச்சகராக உள்ளார். விரதங்களை நிறைவேற்றுபவர்களைத் தவிர, சுவாமியின் முன்னிலையில் ஸ்ரீ சத்யநாராயண சுவாமியின் விரதங்களை அனுசரிக்கக்கூடியவர்களுக்காக ஒரு பெரிய மண்டபமும் ஆசிரியர்களும் உள்ளனர். உலர்ந்த தேங்காய்க் குடுவையில் வெல்லத்தையும், அம்மாவிற்கு அவல் சாதத்தையும் படைப்பது மிகவும் மங்களகரமானது என்று பண்டிதர்கள் கூறுகிறார்கள்.


Comments